ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్‌బాస్‌లో బాలయ్య హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 06, 2018, 11:32 AM



నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన ‘వీరభద్ర’లో నటించిన తనుశ్రీ దత్తా, యువహీరో తనీష్ సరసన ‘చాణక్యుడు’లో నటించిన ఇషితా దత్తాలు బిగ్‌బాస్‌లో సందడి చేయనున్నారు. ఇటీవల ‘బిగ్‌బాస్-12’ లాంచింగ్ ఈవెంట్‌లో సల్మాన్‌ఖాన్ కొంతమంది కంటెస్టెంట్‌‌ల పేర్లు వెల్లడించారు. వారిలో తనుశ్రీ దత్తా, ఇషితాదత్తా ఉన్నారు. వీరు అక్కాచెల్లెళ్లు. బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా యూనివర్శ్ తనుశ్రీ దత్తా తన సోదరి ఇషితా దత్తాతో పాటు ఈ షోలో పార్టిసిపేట్ చేయనుంది. ప్రతీ సీజన్‌లో కొత్తదనాన్ని పరిచయం చేస్తున్న బిగ్‌బాస్ టీమ్ ఈసారి జోడీ కాన్సెప్ట్‌తో ముందుకు వస్తోంది. బిగ్ బాస్-12 (హిందీ) సెప్టెంబరు 16 నుంచి ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com