ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిక్ జోనాస్ తో కలిసి మందేస్తూ అలా సరదాగా టెన్నిస్ టోర్నీని వీక్షిస్తోంది

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 06, 2018, 01:14 PM



జనాల్లో మూడు రకాలు. పేద-బీద-బక్క - మిడిల్ క్లాస్ - రిచ్ క్లాస్. ఒక్కొక్కరి ఆదాయాన్ని బట్టి బిహేవియర్ ఉంటుంది. రిచ్ క్లాస్ యాటిట్యూడ్ ఇతరులతో పోలిస్తే అల్ట్రా మోడ్రన్గా ఊరిస్తూ ఉంటుంది. వాళ్లు చేసింది మేం చేయలేకపోయామే! అని మిగతా లోక్లాస్లు వ్యథకు గురయ్యేలా చేస్తుంది. 70ల వరకూ అమ్మాయిలు పబ్లిగ్గా బీర్ కొట్టే వ్యవహారం.. పబ్లిక్ లో సిగరెట్ కొట్టే సన్నివేశం మన భారతదేశంలో చూడగలిగేవారా? అప్పట్లో పబ్లిక్ లో మందు గ్లాసు పట్టుకుని సిగరెట్ కొట్టిందంటే ఆవిడ హాలీవుడ్ హీరోయినో - ప్యారిస్ మోడల్ నో అనుకునేవారు. ఆ తర్వాత ఆ కల్చర్ ఆర్థిక రాజధాని ముంబై పబ్బు - క్లబ్ లో కనిపించేది.


కట్ చేస్తే ముంబై సినీ పరిశ్రమలో ఈ కల్చర్ విశృంఖలంగా వెలిగిపోయింది. ముంబై కథానాయికల్లో బీర్ కొట్టి - సిగరెట్ స్మెల్ చూడని వాళ్లను చూపిస్తే మీమీద ఒట్టు! అంతెందుకు కమల్ హాసన్ గారాల పట్టీలు శ్రుతిహాసన్ - అక్షరహాసన్  పబ్లిక్ లో సిగరెట్ కొట్టేయడం ఎన్నిసార్లు చూడలేదు జనం. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో నగరంలో కామన్ గాళ్స్ మందేసి - సిగరెట్ కొట్టేస్తూ పబ్లిక్ లో పబ్లిగ్గా దొరికిపోతున్నారు. నేరుగా మందేసి జూబ్లీహిల్స్ రోడ్ లో 120 స్పీడ్ లో కార్ తోలేస్తూ డ్రంక్ & డ్రైవ్ కి చిక్కుతున్నారు.


అందుకే పబ్లిక్ లో సదరు స్టార్ హీరోయిన్ కాబోయేవాడితో కలిసి ఇలా బీరేస్తూ చిద్విలాసంగా ఎంజాయ్ చేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఆ సీన్ ఇండియాలో కాదు కాబట్టి అసలే లైట్ తీస్కున్నారు. రోమ్ వెళ్లినప్పుడు రోమన్ లా ఉండాలని ఎవరు చెప్పారో కానీ పీసీ ఈ సూత్రాన్ని తూ.చ తప్పక ఆచరిస్తోంది. విదేశాల్లో క్వాంటికో సిరీస్ చేసినప్పుడు ఈ అమ్మడు మైండ్ సెట్ పూర్తిగా మార్చుకుంది. రొటీన్ ఇండియన్ మైండ్ సెట్ నుంచి కాస్తంత దూరంగా జరిగింది. ఇదిగో ఇంగ్లండ్ పోరడు - హబ్బీ నిక్ జోనాస్(29)తో కలిసి మందేస్తూ అలా సరదాగా టెన్నిస్ టోర్నీని వీక్షిస్తోంది. యూఎస్ ఓపెన్ లో రఫెల్ నాదల్ ఆటను పీసీ-నిక్ జంట ఇలా ఆస్వాధించారు. ఆ పక్కనే వేరొక హాలీవుడ్ హీరోయిన్ సోఫీ టర్నర్(22) తో పాటు పీసీ మామ్ మధు చోప్రా కూడా ఉన్నారుట! ప్చ్!! మనం ఇంకా మైండ్ సెట్ మార్చుకోవాల్సి ఉంది కదూ!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com