ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సహజీవనం అంటే నాకిష్టం

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 06, 2018, 04:55 PM



కన్నడ హిట్‌ ఫిల్మ్‌ కిరిక్‌ పార్టీ తెలుగులో కిర్రాక్‌ పార్టీగా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. స్నేహం, ప్రేమ ఓ యువకుడి వ్యక్తిత్వాన్ని ఎంతలా మార్చాయనేది ఈ చిత్ర కథాంశం. యువతను ఆకట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ పునర్నిర్మానం కాబోతోంది. కార్తిక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా నటిస్తుండగా…అభిషేక్‌ జైన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్‌ కపూర్‌, ధీరజ్‌ వాద్వాన్‌, వృతికా లేఖర్‌ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. హిందీ కిరిక్‌ పార్టీలో నాయికగా జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ఎంపికైంది. దీంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. సల్మాన్‌ ఖాన్‌ సరసన రేస్‌ 3లో నటించిన తర్వాత జాక్వెలిన్‌ చేస్తున్న చిత్రమిదే. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణకు వెళ్లనుందీ సినిమా. వృత్తిపరంగా ఎప్పుడూ తీరిక లేకుండా ఉండే జాక్వెలిన్‌..వ్యక్తిగత విషయాల్లోనూ వార్తల్లో నిలుస్తుంటుంది. తోటి నటులతో ఆమెకున్న స్నేహం పలు సందర్భాల్లో పుకార్‌లకు తావిచ్చింది. జాక్వెలిన్‌ ఒక హీరోతో సహజీవనం చేస్తుందన్న వార్తలొచ్చాయి. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ….సహజీవనం అంటే నాకిష్టం. అయితే అంత అనుబంధాన్ని నేను కొనసాగించలేను. అని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com