ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గే సెక్స్‌పై సుప్రీం తీర్పు...స్వర భాస్కర్, సెలెబ్రిటీల రెస్పాన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 07, 2018, 11:13 AM



గే సెక్స్ నేరం కాదని సుప్రీం కోర్టు నేడు సంచలన తీర్పు ప్రకటించింది. స్వలింగ సంపర్కానికి చట్టబద్దత కల్పిస్తూ తీర్పు ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. బాలీవుడ్ తారలు, ప్రముఖులు సుప్రీం తీర్పుపై స్పందిస్తున్నారు. అందరూ సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా సుప్రీం తీర్పుతో వివాదాస్పద నటి స్వర భాస్కర్ హర్షం వ్యక్తం చేసింది. దీనిపై ఆమె ట్విట్టర్ వేదికగా వరుస కామెంట్లు చేస్తోంది.సుప్రీం కోర్టు సంచలన తీర్పుపై నటి స్వరభాస్కర్ స్పందించింది. థాంక్యూ సుప్రీం. చాలా మంచి నిర్ణయం ప్రకటించారు. మెజారిటీ వర్గాలు రాజ్యాంగ నిర్ణయాలని నిర్దేశించలేరని మరో మారు సుప్రీం నిరూపించింది అంటూ స్వర భాస్కర్ ట్వీట్ చేసింది.సమభావంతో వ్యవహరించి సున్నిత నిర్ణయాలు తీసుకునే వారు ఈ తరంలో కూడా ఉన్నారని సుప్రీం కోర్టు తాజగా స్పందించింది. సెక్షన్ 377 పై వారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని అర్జున కపూర్ అన్నారు.బాలీవుడ్ దర్శక నిర్మాత సుప్రీం కోర్టు నిర్ణయాన్ని చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించాడు. సుప్రీం తీర్పు ద్వారా మానవత్వానికి, హక్కులకు న్యాయం జరిగిందని తెలిపాడు.మరో నటి శృతి సేథ్ కూడా సుప్రీం తీర్పుని స్వాగతించింది. స్వలింగ సంపర్కం గురించి చాలా కాలంగా సుప్రీం కోర్టులో విచారణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజగా సుప్రీం సంచలన తీర్పు ప్రకటిస్తూ గే సెక్స్ నేరం కాదని తేల్చి చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com