ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయివేటు జెట్ లో పూజా రచ్చ!

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 07, 2018, 12:58 PM



ముంబై భామ పూజా హెగ్డే గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఇప్పుడున్న భామల్లో క్షణం తీరిక లేని అగ్రకథానాయిక. ఒకేసారి నాలుగు సినిమాల్లో నటించేస్తోంది. అన్నీ అగ్రహీరోల సినిమాలే. ఎన్టీఆర్ - మహేష్ - ప్రభాస్ ఈ ముగ్గురితో సినిమాలు ఆన్ సెట్స్ ఉన్నాయి. ఈ మూడిటితో పాటు - అటు బాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4 లాంటి క్రేజీ మూవీలో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ సరసన పూజా నటిస్తోంది. అయితే ఈ సినిమాలన్నీ సెట్స్ పై స్పీడందుకోవడంతో పూజాకి ఊపిరి సలపడం లేదు. ఒక సెట్ నుంచి ఇంకో సెట్ కి హడావుడి హడావుడిగా పరిగెడుతోందిట.


 ఇలా ఓ చోట షూట్ పూర్తయ్యింది అనగానే - వేరొక షెడ్యూల్ తరుముకు రావడంతో పూజా నానా హైరానా పడిపోతోందిట. అరవింద సమేత - మహర్షి చిత్రాలతో బిజీగా ఉన్న పూజాకి మరో హడావుడి తప్పలేదు.  ప్రభాస్ 20 సినిమాని ఇటీవలే లాంచ్ చేశారు. ఇకపై ఈ సినిమా రెగ్యులర్ షూట్ తో పూజాకి ఊపిరి సలపదు. అలానే హౌస్ ఫుల్ 4 చిత్రీకరణ స్వింగులో ఉంది. దీని వల్ల ఎన్టీఆర్ - మహేష్ సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ రెండు చిత్రాల సెట్స్ కి వెళ్లాల్సొస్తోంది.


ఇలాంటి సన్నివేశంలో వేరొక అత్యవసర పరిస్థితి ఏర్పడిందిట. ఓవైపు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పూజా హౌస్ ఫుల్ 4 సెట్స్కి పరిగెత్తాల్సి వచ్చింది. ఆ సినిమా షూటింగ్ జై సల్మేర్ లాంటి విమాన సౌకర్యం లేని చోట చేస్తున్నారు. అక్కడికి ఒకే ఒక్క ఫ్లైట్ అందుబాటులో ఉందిట. దాంతో ఆ విమానం దొరక్క పూజా హైదరాబాద్ నుంచి ఏకంగా ఓ ప్రయివేటు జెట్ ని బుక్ చేసుకుందిట. లక్షల్లో చెల్లించి ఆ జెట్ లో జై సల్మేర్ లోని లొకేషన్కి వెళ్లిందిట.  పూజాకి వృత్తి అంటే అంతటి డెడికేషన్ అంటూ మాట్లాడుకుంటున్నారు. లక్షల్లో సొమ్ములు పోయినా పని ఆగకూడదన్నది తన సిద్ధాంతం అని చెప్పుకుంటున్నారు. అంత కమిట్ మెంట్ ఉన్న అమ్మడు కాబట్టే.. ఒకేసారి నాలుగు భారీ సినిమాల్లో ఛాన్సులు అందుకుందన్నమాట! 





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com