నటుడిగా, దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న హాలీవుడ్ లెజండరీ యాక్టర్ బుర్ట్ రెనాల్డ్స్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు..మరణ వార్తను ఆయన మేనేజర్ ఎరిక్ క్రిట్జెర్ అధికారికంగా ప్రకటించారు. బుర్ట్ మరణంపై ప్రముఖ నటులు ఆర్నాల్డ్, స్టీవ్ హార్వే, రెబా తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 1936లో పుట్టిన బర్ట్ రెనాల్డ్స్ గన్స్మోక్, బాక్ టెలివిజన్ సిరీస్‌లతో మంచి పేరు తెచ్చుకున్నారు. బర్ట్ రెనాల్డ్స్, డెలివరెన్స్, బూగీ నైట్స్ మూవీలలో మంచి పాత్రలు పోషించి అందరి దృష్టి ఆకర్షించారు . అలాగే లాంగెస్ట్ యార్డ్, బూగీ నైట్స్, స్మోకీ అండ్ ది బాండిట్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధించాయి. నటుడిగా,దర్శకుడిగా రెండు రంగాలలో రాణించాడు.
ఫ్లోరిడాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను కూడ స్థాపించారు. రెండు ఆటోబయోగ్రఫీలను కూడా తీసుకొచ్చిన ఆయన 1997లో బూగీ నైట్స్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది. రెండు సార్లు పెళ్ళి చేసుకున్న ఈయన తొలిసారి బ్రిటీష్ యాక్ట్రెస్ జూడీ కార్నేని 1963లో వివాహం చేసుకున్నాడు. రెండేళ్ళ తర్వాత వివాహం చేసుకున్న ఆయన అమెరికన్ యాక్ట్రెస్ లోని ఆండర్సన్ని 1988లో పెళ్ళి చేసుకున్నాడు. 1993లో ఆమెకి విడాకులు ఇచ్చారు. క్వింటన్ అనే వ్యక్తిని కుమారుడిగా దత్తత తీసుకున్నారు బుర్ట్. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని హాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాలను ప్రకటించారు.