ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిక్ సంతోష‌మే నా సంతోషం : ఒలీవియా కల్పో

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 07, 2018, 02:54 PM



నిక్‌ విషయంలో నేను సంతోషంగానే ఉన్నానని  అతడికి కొత్త ప్రేమ దొరికింది. జీవితాంతం అతడు సంతోషంగా ఉంటే.. నాకన్నా ఆనందించే వాళ్లు ఎవరూ ఉండరు  అంటూ తన స్పందన తెలియజేసింది  నిక్‌ జోనస్‌ మాజీ ప్రేయసి ఒలీవియా కల్పో. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.  కాగా గత నెల  18న ముంబైలో అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థ వేడుక జరిగింది. అయితే ప్రియాంక కంటే ముందు నిక్‌ మరో ఇద్దరు భామలతో డేటింగ్‌ చేశాడు. వారిలో మాజీ మిస్‌ యూనివర్స్‌ ఒలీవియా కల్పో కూడా ఒకరు. 2012లో విశ్వ సుందరిగా ఎంపికైన తర్వాత ఒలీవియా బాగా ఫేమస్‌ అయ్యారు. ఈ క్రమంలోనే 2013లో నిక్‌- ఒలీవియాల ప్రేమకథ మొదలైంది. రెండేళ్ల అనంతరం వీరు విడిపోయారు. కాగా ఒలీవియా ప్రస్తుతం డానీ అమెండోలా అనే ఫుట్‌బాల్‌ ప్లేయర్‌తో ప్రేమలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com