ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అదుగో' నుంచి టీజర్ వచ్చేసింది

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 07, 2018, 04:39 PM



నటుడిగా విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చిన రవిబాబు, దర్శకుడిగా కూడా విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన 'పందిపిల్ల' ప్రధాన పాత్రగా 'అదుగో' సినిమాను రూపొందించాడు. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితమే టీజర్ ను రిలీజ్ చేశారు.బంటి( పంది పిల్ల) చెప్పినట్టు చేయడం .. డాన్స్ కూడా చేసేయడం చూపించారు. ఈ టీజర్ చిన్నపిల్లలను ఆకట్టుకునేలానే వుంది. కేవలం పంది పిల్లను మాత్రమే చూపిస్తూ టీజర్ ను కట్ చేసిన రవిబాబు, సినిమాపై ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com