ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అరవింద సమేత' ఆడియో రిలీజ్ కి ముహూర్తం కుదిరింది

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 07, 2018, 04:41 PM



త్రివిక్రమ్ దర్శకత్వంలో .. ఫ్యాక్షన్ తో ముడిపడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'అరవింద సమేత వీర రాఘవ' రూపొందుతోంది. డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ కనిపించనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ దిశగా చకచకా పనులు జరిగిపోతున్నాయి.


ఈ నేపథ్యంలో ఆడియో రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుకను హైదరాబాద్ లోని 'నోవాటెల్' హోటల్లో నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. సిరివెన్నెల .. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.     






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com