పదిహేనేళ్ల క్రితం తమిళంలో విడుదలైన ‘సామి’ చిత్రం ఆ రోజుల్లో ఒక సంచలనం. అందులో హీరోగా నటించిన విక్రమ్ ఎంతో పాపులర్ అయ్యారు. కోట శ్రీనివాసరావు ఈ సినిమాతోనే తమిళ చిత్రరంగంలోకి విలన్గా ఎంటర్ అయ్యారు. ఇదే సినిమాను బాలకృష్ణ హీరోగా ‘లక్ష్మీనరసింహా’ పేరుతో రీమేక్ చేశారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన బాలకృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ‘సామి’ చిత్రానికి సీక్వెల్ తయారైంది. ‘సామి స్క్వేర్’ పేరుతో రూపొందిన ఈ సినిమాలో కూడా విక్రమ్ హీరోగా నటించారు. అదే చిత్రాన్ని తెలుగులో ‘సామి’ పేరుతో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ విడుదల చేస్తున్నారు. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తీ సురేశ్ హీరోయిన్. తొలి కాపీ సిద్ధమైన ఈ సినిమాను మూడో వారంలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు.