ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ది ఫాగ్’ ట్రైలర్: ముసురు చాటున ముద్దుల వర్షం

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 08, 2018, 12:12 PM



చుట్టూ తెల్లని ముసురు.. అందులో ఏదో మతలబు ఉంది. వరుసగా ముగ్గురి హత్యలు. ఇంతకీ ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎవరా హంతకుడు? ఇదంతా చేస్తుంది మనుషులా, పొగ వెనుక దాగిన దెయ్యమా? శుక్రవారం విడుదలైన ‘ది ఫాగ్’ ట్రైలర్‌.. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి బాగానే నచ్చుతుంది. మ్యాజిక్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై మధుసూదన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి వేలి ముద్రలు హత్యకు గురైనవారి శరీరాలపై ఉండటం ఏమిటనే సన్నివేశంతో ఈ ట్రైలర్ మొదలై.. కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో నడిచింది. చివరిలో వేడి పుట్టించే ముద్దు సన్నివేశాలతో యూత్‌కు కావల్సిన మసాలను దట్టించారు. ఎంవీ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విరాట్‌చంద్ర, చందన, హరిణి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com