సుధీర్‌బాబు నటిస్తూ, సొంతంగా నిర్మిస్తున్న చిత్రం నన్ను దోచుకుందువటే. ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన టీజర్లో సినిమా కాన్సెప్ట్ మొత్తం తెలియజేశారు. సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్‌గా, అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేష్ కనిపించింది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 21న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సురేష్ రగుతు, సంగీతం అజనీష్ బి.లోకనాథ్. ఇక మూవీ రిలీజ్ తేది దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.. దీనిలో భాగంగా సుధీర్ బాబు డ్యూయల్ రోల్ అంటూ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది.. ఫన్నీగా ఉన్న ఈ వీడియోను మీరూ చూడండి.