ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్ హీరో భార్య బోల్డ్ కాస్ట్యూమ్స్ లో

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 10, 2018, 04:47 PM



ఈమద్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మరియు సెలబ్రెటీలు హాలీవుడ్ హీరోయిన్స్ కు తాము ఏమాత్రం తక్కువ కాదు అంటూ నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్ హీరోయిన్స్ అవార్డు వేడుకల్లో - ఏదైనా పార్టీల్లో చాలా హాట్ గా కనిపించేందుకు ట్రెండీ కాస్ట్యూమ్స్ ను ధరిస్తారు. ఆ పద్దతి ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా అనుసరిస్తున్నారు. ఏదైనా అవార్డు వేడుక అయినా - పార్టీలైనా కూడా బాలీవుడ్ స్టార్స్ వేసుకు వచ్చే డ్రస్ లపై ఎక్కువ శాతం జనాలు దృష్టి పెడుతూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 51వ పుట్టిన రోజును జరుపుకున్నాడు.


అక్షయ్ తన పుట్టిన రోజు సందర్బంగా ఆత్మీయులకు పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో ఆయన భార్య అయిన ట్వింకిల్ ఖన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 43 ఏళ్ల ట్వింకిల్ ఖన్నా పార్టీ సందర్బంగా వేసుకున్న డ్రస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వయస్సులో ట్వింకిల్ ఇంత హాట్ గానా అంటూ సోషల్ మీడియాలో ఈమె ఫొటోలోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. గతంలో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ట్వింకిల్ ఖన్నా గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటుంది.


 


అక్షయ్ బర్త్ డే పార్టీలో ట్వింకిల్ ఖన్నా లుక్ హైలైట్ అయ్యిందంటూ బాలీవుడ్ వర్గాల్లో  టాక్ వినిపిస్తుంది. ప్రస్తుత యువ హీరోయిన్స్కు ఏమాత్రం తీసిపోకుండా ట్వింకిల్ ఖన్నా ఇంకా కూడా తన బ్యూటీని కాపాడుకుంటూ వస్తుంది. ఇక అక్షయ్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోల్డ్ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. త్వరలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.ఓ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విభిన్న చిత్రాల హీరోగా - ప్రమోగాత్మక చిత్రాలను చేసేందుకు ఎప్పుడు ముందుండే హీరోగా అక్షయ్ కుమార్ కు బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com