బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ మణికర్ణిక..ఈ మూవీకి క్రిష్ దర్శకుడు.. క్రిష్ ఆధ్వర్యంలో 90 శాతం షూటింగ్ పూర్తి అయింది.. కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది.. క్రిష్ కు ఎన్టీఆర్ బయోపిక్ లో దర్శకుడిగా అవకాశం రావడంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చాడు.. దీంతో కంగనా మిగతా ప్యాచ్ వర్క్ కు ఆమె దర్శక బాధ్యతలు స్వీకరించి షూటింగ్ ప్రారంభించింది.. దీంతో మనస్థాపం చెందిన క్రిష్ ఆ మూవీ నుంచి తప్పుకున్నాడు.. దీని తర్వాత ఈ మూవీలో మరో ప్రధాన పాత్రధారి సోనూ సూద్ పట్ల కంగనా అతిగా ప్రవర్తించడంతో అతడూ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు.. తాజాగా ఈ మూవీ నిర్మాత నిర్మాత సంజయ్ కుట్టి కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి కారణం షూటింగ్ లేట్ కావడమేనట. దీంతో బడ్జెట్ బాగా పెరిగిపోయిందని సమాచారం. రూ.70 కోట్లతో అయిపోతుందనుకున్న నిర్మాణ వ్యయం రూ.100 కోట్లకు చేరుకునేలా ఉందట. దీంతో సంజయ్ తప్పుకున్నట్టు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాను కొత్త నిర్మాతలు తీసుకున్నారట.