కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానీ తాజాగా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన ఛలో ఫేం రష్మిక మందాన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో దేవ్ అనే పాత్రలో డాన్ గా నాగ్, దాస్ అనే పాత్రలో డాక్టర్ గా నాని కనిపించనున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు . సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటించనున్నారు.. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది.. ఈ సందర్భంగా సెట్ లోని వారందరూ ఒక గ్రూప్ ఫోటో దిగారు.. ఆ ఫోటోని చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ మూవీకి మణి శర్మ సంగీతం సమకూరుస్తున్నాడు.