ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘యన్‌టీఆర్‌’లో చంద్రబాబుగా రానా ఫస్ట్‌లుక్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 12, 2018, 03:26 PM



హైదరాబాద్‌: రానా దగ్గుబాటి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ‘యన్‌టీఆర్‌’ బయోపిక్‌లో రానా..ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రంలో చంద్రబాబుగా రానా లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 1984లో చంద్రబాబు లుక్‌ ఇలా ఉండేది అంటూ రానా ట్విటర్‌ ద్వారా దీనిని విడుదల చేశారు.


‘యన్‌టీఆర్’ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ నటిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది. రానా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అబిడ్స్‌లోని ఎన్టీఆర్‌ నివాసం నుంచే మొదలైంది. ఇందులో అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్‌ నటిస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com