బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌తో కలిసి నటించేందుకు సల్మాన్ ఖాన్ బావ, లవ్ రాత్రి మూవీ హీరో ఆయుష్ శర్మ విముఖత వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయుష్ శర్మ సరసన నటించేందుకు కత్రినా కైఫ్ నిరాకరించిందని గతంలో వార్తలు రాగా.. తాజాగా ఈ భామతో నటించేందుకు హీరో ఆయుష్ కూడా ఆసక్తి చూపలేదు. కొన్ని ప్రత్యేక కారణాలతో కత్రినాతో తాను పనిచేయలేనని ఓ ఎంటర్టైన్మెంట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ బావ ఆయుష్ శర్మ స్పష్టం చేశాడు.