ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా ప్రేమ అలా మొద‌లైంద‌న్న నిక్‌....

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 14, 2018, 02:42 PM



ఇటీవల ఓ హాలీవుడ్‌ ఇంటర్వ్యూలో ఈ మీ ప్రేమ ఎలా చిగురించింద‌ని  హాలీవుడ్ సింగ‌ర్‌..న‌టుడు  నిక్‌ని అడగ్గా  ప్రియాంక, నేను కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా మీట్‌ అయ్యాం. ఫస్ట్‌ మెసేజెస్‌ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. ఆ తర్వాత ఫోన్‌ కాల్స్‌.  ఇలా కొన్ని నెలలు గడిచాయి. మళ్లీ మేం పర్సనల్‌గా కలవడానికి ఆరు నెలలు పట్టింది. అప్పుడు మేం ఫస్ట్‌ టైమ్‌ ‘మెట్‌ గాలా’ ఈవెంట్‌కి హాజరయ్యాం. అప్పటికి మేం ఇంకా ఫ్రెండ్స్‌గానే ఉన్నాం. మా కామన్‌ ఫ్రెండ్స్‌ అందరూ మా మధ్య ఏదో ఉందని ఊహించుకుని  అడిగే వారు. కానీ మా ఇద్దరి సమాధానం మాత్రం ఒక్కటే ‘మేం ఫ్రెండ్స్‌’ మాత్రమే అని. మా జర్నీ అలా కొనసాగింది. అందరూ మేం దాస్తున్నాం అనుకునేవాళ్లు. ఐదు నెలల క్రితమే మా రిలేషన్‌షిప్‌ పట్ల మేం సీరియస్‌గా ఉన్నాం అని ఫీల్‌ అయ్యాం. ఇదే రైట్‌ టైమ్‌ అని మా ఇద్దరికీ అర్థం అయింది. వెంటనే ఎంగేజ్‌ అయిపోయాం’’ అని తెలిపాడు. అలాగే ఇద్దరికీ కలిపి పెట్టిన పేర్లలో ‘ప్రిక్‌’ అన్నది తనకి నచ్చిందని కూడా  వెల్ల‌డించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com