దర్శకురాలిగా కొత్త అవతారం ఎత్తబోతోంది ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత హాలె బెర్రీ. 52 ఏళ్ల వయసులో ఆమె తొలిసారి మెగాఫోన్ పట్టనుండటం విశేషం. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘బ్రూయిస్డ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమైంది బెర్రీ. మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో ఓ వెలుగు వెలిగి కనుమరుగైన ఓ యోధురాలు ప్రస్తుతం ఆ యుద్ధవిద్యలో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన యువకుడితో బరిలోకి దిగాల్సి వస్తుంది. తన కన్నకూతురి కోసం తప్పక ఆ పోటీలో గెలవాల్సి వస్తుంది. మరి ఆమె ఆ లక్ష్యాన్ని ఎలా సాధించందన్న కథాంశంతో బెర్రీ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఇందులో ఆమె ఓ పాత్రలో నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించబోతోంది.