కాల్షీట్ కావాలంటే మరో రెండేళ్లు ఆగండి: నటుడు యోగిబాబు

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 17, 2018, 12:39 PM

కొన్నికొన్ని సినిమాలు నటులను రాత్రికిరాత్రి స్టార్లను చేసేస్తాయి. భారీ స్టార్ డమ్ ను తెచ్చి పెట్టేస్తాయి. దీంతో అప్పటివరకూ ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. అంటూ తిరిగిన నటులకు కనీసం కొత్త కాల్షీట్ సర్దుబాటు చేసేందుకు కూడా తీరిక ఉండదు. ప్రస్తుతం తమిళ నటుడు యోగిబాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. నిన్న మొన్నటివరకూ ఆఫర్ల కోసం తీవ్రంగా కష్టపడ్డ యోగిబాబు కోసం ఇప్పుడు నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నారు. తమ సినిమాలో నటించాలనీ, కావాల్సినంత పారితోషకం ఇస్తామని చెబుతున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా ఇతివృత్తంగా తెరకెక్కిన కోకో కోకిల(తమిళంలో కొలమావు కోకిల) సినిమాతో యోగిబాబు దశ, దిశ మారిపోయాయి. ఈ సినిమాలో నయనతారకు జోడీగా నటించడం, సినిమా హిట్ కావడంతో యోగి బాబుకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఈ పోరు భరించలేక తన డైరీ 2020 డిసెంబర్ వరకూ ఖాళీ లేదని యోగి బాబు చెప్పి పంపిస్తున్నాడు. ఇదిలా ఉండగా శ్యామ్‌ ఆంటన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘గుర్కా’ అనే చిత్రంలోనూ యోగిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
Recent Post