మిస్టర్ మజ్ను సినిమా నుంచి ఫస్టులుక్ వచ్చేస్తోంది

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 17, 2018, 12:42 PM

అక్కినేని అభిమానులంతా అఖిల్ మూడవ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కథాపరంగా ఈ సినిమా షూటింగును విదేశాల్లో ఎక్కువగా జరుపుతూ వచ్చారు. ఈ సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను కొన్ని రోజుల క్రితమే ఖరారు చేశారు. టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ కోసం అంతా ఆసక్తితో వున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ నెల 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరి మూడు రకాల ఫస్టులుక్ లను నాగార్జున ముందుంచాడట. వాటిలో ఒకటి లేదా రెండు పోస్టర్స్ ను నాగార్జున ఓకే చేయవచ్చని అంటున్నారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.  
Recent Post