శనివారం తమిళ అర్జున్ రెడ్డి ఆడియో వేడుక

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 18, 2018, 12:43 PM

తెలుగులో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని నమోదు చేసింది. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో కొత్త ట్రెండ్ కి తెరదీసింది. ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడంతో, ఇతర భాషల్లో రీమేక్ అవుతోంది. తమిళ రీమేక్ కి 'బాలా' దర్శకత్వం వహిస్తున్నాడు. విక్రమ్ తనయుడు 'ధృవ్' ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఆయన జోడీగా మేఘా చౌదరి నటిస్తోంది. ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, తాజాగా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రధన్ సంగీతాన్ని అందించగా .. ఈ శనివారం ఆడియో వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలి ప్రయత్నంలోనే ధృవ్ కి హిట్ పడటం ఖాయమనే బలమైన నమ్మకంతో విక్రమ్ వున్నారు. 
Recent Post