అక్కినేని ఇంటిపేరుగా వచ్చాక బాధ్యత పెరిగింది: సమంత

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 18, 2018, 12:51 PM

అక్కినేని అనే ఇంటిపేరు వచ్చాక మీకు ఎలా అనిపిస్తోంది? అనే ప్రశ్న సమంతకి ఎదురైంది. అందుకు సమంత స్పందిస్తూ .. "అక్కినేని అనే ఇంటిపేరు వచ్చాక నాకు బాధ్యత పెరిగింది. సాధారణమైన సమంతగా నేను ఏమైనా చేయవచ్చు .. ఏదైనా మాట్లాడవచ్చు. కానీ అక్కినేని అనే ఇంటిపేరు వలన నేను ఎంతో బాధ్యతగా వుండవలసి వుంది" అని చెప్పుకొచ్చారు. ఇక 'శైలజా రెడ్డి అల్లుడు' .. 'యూటర్న్' సినిమాలు ఒకేసారి విడుదల కావడం గురించి ఆమె స్పందిస్తూ .. "ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి పోటీ లేదు .. రెండు వేరు వేరు జోనర్లు. రెండు సినిమాలు ఒకేసారి థియేటర్స్ కి రావాలని ప్లాన్ చేసింది కాదు .. అనుకోకుండా అలా జరిగిపోయిందంతే" అని చెప్పుకొచ్చారు.  
Recent Post