త‌్రిష‌ను ఓ లెక్క‌లో వేసుకున్న నెటిజ‌న్స్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 19, 2018, 09:50 AM

న‌టి  త్రిష రీసెంట్ గా ఒక డాల్ఫిన్ పూల్ లో దిగింది.  అంతేకాదు ఒక  డాల్ఫిన్ ను ప్రేమగా నిమిరింది.  దాన్ని ముద్దుపెట్టుకుంది. ఇక అది కూడా త్రిషకు ఒక ముద్దిచ్చింది.  ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.  దానికి “లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ను నమ్మండి” అనే క్యాప్షన్ ఇచ్చింది. చాలామందికి ఆ ఫోటోలు తెగ నచ్చాయి. క్యూట్ అని బ్యూటిఫుల్ అని మెచ్చుకున్నారు. కానీ ప్రతి దానిలో నెగెటివ్ ను చూసే కొందరు ఉంటారుగా వాళ్ళు గట్టిగా త్రిషను తగులుకున్నారు.  నువ్వు యానిమల్ లవర్ అంటావుగా మరి ఇలా బంధించి.. ఫ్రీడమ్ లేకుండా చేసిన వాతావరణంలో ఉన్న డాల్పిన్ తో ఫోటోలు దిగడం ఎలా చేస్తావు.. అదేనా జంతుప్రేమ అంటే.. నీదంతా హిపోక్రసీ..” అని గట్టిగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
Recent Post