అత్య‌థిక వ్యూస్ సాధించిన తొలి తెలుగు పాట‌గా

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 19, 2018, 12:57 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘ఫిదా . వ‌రుణ్ తేజ్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది.అలాగే ఈ మూవీలో సాంగ్స్ కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి.. ముఖ్యంగా మధుప్రియ, రాంకీ ఆలపించిన “వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెటు యేసిండే గమ్మున కూసో నియ్యాడే .. కుదురుగా నిల్సోనియాడే” అనే పాట విశేషమైన జనాదరణ పొందింది. ఇప్పటికీ ఈ పాట స్టేజ్ షోలపైనా .. ఫంక్షన్స్ లోను వినిపిస్తూనే వుంది. యూట్యూబ్ లో ఈ పాటను ఇంతవరకూ 150 మిలియన్ల మంది వీక్షించారు. ఈ విషయాన్ని దర్శకుడు ఫేస్ బుక్ ద్వారా శేఖర్ కమ్ముల తెలీయజేశాడు. ‘150 మిలియన్ మార్క్ ను దాటిన తొలి తెలుగు పాట ఇదే .. అద్భుతమైన మీ స్పందనకు ధన్యవాదాలు .. ఈ మ్యాజిక్ లో భాగమైన ‘ఫిదా’ టీమ్ కి శుభాకాంక్షలు’ అని ఆయన పోస్ట్ చేశాడు
Recent Post