స్విట్జర్లాండ్ టూర్ లో జాన్వీ కపూర్

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 19, 2018, 01:04 PM

స్విట్జర్లాండ్ అంటేనే భూతల స్వర్గం. ప్రకృతి అందాలకు నెలవు. భూమ్మీద మరో పండోరా లాంటిది అంటే అతిశయోక్తి కాదు. దాదాపు పాతికేళ్ల క్రితం రిలీజైన `దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే` (షారూక్-కాజోల్) సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం వెనక స్విస్ అందాలు కీలక పాత్ర పోషించాయని సినీవిశ్లేషకులు ఇప్పటికీ చెబుతుంటారు. ఆ అద్భుత ప్రేమకావ్యం మెజారిటీ పార్ట్ స్విస్ అందాల నడుమ తెరకెక్కింది. అయితే స్విట్జర్లాండ్ గురించి ఎందుకీ ప్రస్థావన? అంటే కచ్ఛితంగా సందర్భం వచ్చిందనే చెప్పాలి.


ఇదిగో షారూక్- కాజోల్ ప్రేమ జంట నడయాడిన చోట అందాల జాన్వీ తన ఫేవరెట్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి షికార్లు చేస్తోంది. నచ్చినట్టు అక్కడ ప్రకృతి అందాల్ని ఆస్వాధిస్తోంది. అతడి తో కలిసి బ్రేక్ ఫాస్ట్ లు - డిన్నర్లు చేస్తోంది. లోకల్ ట్రైన్ లో ఊరూ వాడా చుట్టేస్తూ చిలౌట్ చేస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు - వీడియోల్ని మనీష్ స్వయంగా తన ఇన్ స్టాగ్రమ్ ద్వారా షేర్ చేశారు.


జాన్వీ సో క్యూట్ .. ఇలా డిజైనర్ తో కలిసి అక్కడ ఫోటోషూట్లకు వెళ్లిందో లేక ఇంకేదైనా స్పెషల్ ట్రిప్ నో తెలియాల్సి ఉందింకా. `ధడక్` చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన జాన్వీ అంతకంతకు ఇండస్ట్రీలో వేడి పెంచేస్తోంది. రెండో ప్రయత్నమే కరణ్ జోహార్ నిర్మిస్తున్న భారీ హిస్టారికల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మామ్ శ్రీదేవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కరణ్ ఈ సాయం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇండస్ట్రీ బిగ్ బీలంతా జాన్వీని పెద్ద స్టార్ ని చేసేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇదంతా `మామ్` శ్రీదేవి పైనుంచి చూస్తూనే ఉన్నారు సుమీ!! 


 
Recent Post