ఆ చిత్రంలో కీర్తి సురేష్ నటించడం లేదట

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 19, 2018, 01:09 PM

మహనటి చిత్రంలో సావిత్రి పాత్రలో నటించి తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది మలయాళీ భామ కీర్తి సురేష్. ఈ సినిమా తరువాత తమిళంలో విశాల్ సరసన ‘పందెంకోడి 2’చిత్రంలో నటించగా , చియాన్ విక్రమ్ తో ‘సామి’ అనే చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల్లో సామి ఈ నెల 21న విడుదలకానుండగా, పందెంకోడి 2 అక్టోబర్18న విడుదలకానుంది.


ఇక ఇప్పుడు ఆమె తమిళ నటుడు శశి కుమార్ నటిస్తున్న ‘కొంబు వేచ సింగం’ అనే చిత్రంలో నటిస్తుందని గత కొద్దీ రోజులగా వార్తలు వస్తున్నాయి. ఈవార్తలను కీర్తి కొట్టిపడేశారు. ప్రస్తుతం నేను ఏ చిత్రానికి కమిట్ కాలేదని ఆమె అన్నారు. ఇక కీర్తి తెలుగులో ‘మహనటి’ చిత్రం తరువాత మరో చిత్రాన్ని అంగీకరించలేదు.
Recent Post