సినీనటుడు మోహన్‌బాబు తల్లి మంచు లక్ష్మమ్మ కన్నుమూత

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 20, 2018, 11:08 AM

సినీనటుడు మోహన్‌బాబు తల్లి మంచు లక్ష్మమ్మ (86) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం లక్ష్మమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కాసేపట్లో లక్ష్మమ్మ భౌతికకాయాన్ని విద్యానికేతన్‌ విద్యా సంస్థలకు తరలించనున్నారు. మోహన్‌బాబు, అతని కుటుంబ సభ్యులు ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. తన తల్లి మరణవార్త తెలియగానే మోహన్‌బాబు హుటాహుటిన బయలుదేరినట్లు తెలుస్తోంది. శుక్రవారం లక్ష్మమ్మ పార్థివ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు మోహన్‌బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
Recent Post