పండోరాలో అంబానీ కూతురు ప్రీపెళ్లి

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 21, 2018, 08:15 AM

ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత అరుగు వేసి.. ఊరూ వాడా అదిరేలా చేయాలి పెళ్లంటే. మా ఇంట్లో పెళ్లంటే పది వూళ్లు చెప్పుకోవాలి! .. ఈ తరహా పెళ్లిళ్లకు కాలం చెల్లింది. ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ స్టైల్.  పెళ్లి చేసేవాడు సాక్షాత్తూ అంబానీయే అయితే ఇంకేమైనా ఉందా? ఏకంగా ఏ పండోరా గ్రహాన్నో - బుధ గ్రహాన్నో సరదాగా కొనేస్తాడు. చార్టర్డ్ ఫ్లైట్లు బుక్ చేసి - ల్యాండింగ్ ప్యాడ్ నిర్మించేస్తాడు.


ఇదిగో ఇది అంబానీల ఇంట పెళ్లి వేడుకే. డుండుండు డోలు భాజా మోగించేందుకు రెడీ అవుతోంది. ఫోర్బ్స్ కుబేరుడు - రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ వివాహం .. తాను వలచిన సఖుడు పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ వారసుడు ఆనంద్ పిరమాల్ తో జరుగనుంది. ఎంగేజ్మెంట్ ఎక్కడో తెలుసా?  పండోరాని తలపించే హాలీడే స్పాట్ `లేక్ కోమో- విల్లా బల్బియానో`లో ఈ వేడుక జరగనుంది. హాలీవుడ్ నుంచి విల్ స్మిత్ - బ్రాడ్  పిట్ రేంజు స్టార్లు హుక్కా పీలుస్తూ ఇక్కడ సేద దీరేందుకు విచ్చేస్తుంటారు. అలాంటి చోట అంబానీ కూతురు వివాహ నిశ్చితార్థం జరగనుంది. అది కూడా ఈ 21 - 22  తేదీల్లో మోత మోగిస్తారుట. ఈ నిశ్చితార్థం రెండో రోజు సంగీత్ - డిన్నర్ పీక్స్లో ప్లాన్ చేసేశారు. బాలీవుడ్ నుంచి బెస్ట్ సెలబ్రిటీలు  ఈ నిశ్చితార్థానికి ఎటెండ్ కానున్నారు.


ఈ ఏడాది ఆరంభంలోనే మహాబలేశ్వర్ లోని ఓ ప్రఖ్యాత దేవాలయంలో మిస్టర్ ఆనంద్ ..  ఇషా అంబానీకి ప్రపోజ్ చేశాడు. అటుపై ఆ ఇద్దరి పెళ్లికి ఇరువైపుల కుటుంబాలు అంగీకరించాయి. మేలో ఓ భారీ ఈవెంట్ లో ప్రేమజంట పెద్దల ఆశీస్సులు తీసుకుంది. ఇడ్లీలు తిన్నారా.. టీలు తాగారా? అని అడిగే తుంటరి బ్యాచ్ లకు వెల్ కం లేదిక్కడ!


 
Recent Post