ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘భలే మంచి చౌకబేరమ్’ ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 26, 2018, 09:51 AM



శ్రీసత్యసాయి ఆర్ట్స్‌, కె.కె.రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్‌, ‘పంతం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ ‘భలే మంచి చౌక బేరమ్‌’ చిత్రాన్ని సమర్పించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను  చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.


నవీద్‌, ‘కేరింత’ నూకరాజు, యామిని భాస్కర్‌, రాజారవీంద్ర, భద్రం, ముజ్‌తబా అలీ ఖాన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కాన్సెప్ట్‌: మారుతి, కథ, మాటలు: రవి నంబూరి, సంగీతం: హరి గౌర, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: జె.బి., పాటలు: పూర్ణాచారి, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., ఎడిటింగ్‌: ఉద్ధవ్‌ ఎస్‌.బి., ఆర్ట్‌: మురళి ఎస్‌.వి., సమర్పణ: కె.కె.రాధామోహన్‌ (శ్రీసత్యసాయి ఆర్ట్స్‌) , సహ నిర్మాతలు : గుడ్ సినిమా గ్రూప్, నిర్మాత: అరోళ్ళ సతీష్‌కుమార్‌,


స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మురళీకృష్ణ ముడిదాని






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com