ట్రెండింగ్
Epaper    English    தமிழ்

.`ఎన్టీఆర్` బయోపిక్ ..హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 12, 2018, 12:37 PM



బాబాయ్.. అబ్బాయ్ ల మధ్య సరైన సఖ్యత లేదని అప్పట్లో ప్రచారమైంది. నందమూరి కుటుంబంలో కలతలున్నాయంటూ ఒక సెక్షన్ మీడియా అదే పనిగా ప్రచారం చేసింది. అయితే అదంతా గతం.. వర్తమానంలో వారి మధ్య సఖ్యత గురించి అంతే ఇదిగా మీడియా సహా జనాల్లో పసందైన ముచ్చట సాగుతోంది. ఇది `ఎన్టీఆర్` బయోపిక్ కలిపిన బంధం.


నటసింహా నందమూరి బాలకృష్ణ అంటే హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ లకు ఎంతటి అభిమానమో.. ఇదివరకూ పలు వేదికలపై నేరుగానే అభిమానులు చూశారు. అభిమానుల్లో డివైడ్ ఫ్యాక్టర్ ఉన్నా... మేం మాత్రం కలిసే ఉన్నామని పదే పదే కన్వే చేసేందుకు కళ్యాణ్ రామ్ తారక్ ఎంతో ఎమోషన్ అయ్యేవారు. వేదికలపై వాళ్లను వీక్షించిన ఆ సంగతి అందరికీ అర్థమయ్యేదిప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న `ఎన్టీఆర్` చిత్రంలో హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆన్ లొకేషన్ బాబాయ్ ని కలిశాడు కళ్యాణరాముడు. ఈ శుభవేళ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ``30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో `బాలగోపాలుడు` సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు .. బాబాయ్ - వాళ్ల నాన్న గారిలా...నేను - మా నాన్నగారిలా...!!`` అంటూ సంబరంగా చెప్పుకున్నాడు. మొత్తానికి బాబాయ్- అబ్బాయ్ కలయిక అరుదైనది. ఆరోజుల్లో రాజకీయ ప్రత్యర్థుల కుట్రల నడుమ అన్నగారు ఎన్టీఆర్ - తన కుమారుడు హరికృష్ణతో ఎన్నో విషయాల్ని షేర్ చేసుకునేవారు. అలా ఇదిగో ఈ తీరుగా తనపై చెయ్యి వేసి ఏదో రహస్య మంత్రాంగం నడిపిస్తున్నారు. చైతన్య రథసారధితో రథసారథి మంత్రాంగం ఏంటో పెద్ద తెరపై వీక్షించే తరుణం జనవరిలో రానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com