ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగింపు దశలో నిఖిల్ 'ముద్ర'

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 12, 2018, 04:00 PM



నిఖిల్ తాజా చిత్రంగా 'ముద్ర' రూపొందుతోంది. టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగుతో పాటు డబ్బింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు.లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, నవంబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నిఖిల్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడు. ఇక ఈ మధ్య రేస్ లో లావణ్య త్రిపాఠి కాస్త వెనుకబడిపోయింది. అందువలన ఆమె కూడా ఈ సినిమా హిట్ తనకి చాలా అవసరమని భావిస్తోంది. మరి వాళ్లు ఆశించిన ఫలితాన్ని ఈ సినిమా అందిస్తుందో లేదో చూడాలి.       






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com