దర్శకుడు రోహిత్‌శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం సింబా. ఈ మూవీలో రణ్వీర్ సింగ్..సారా అలీఖాన్ హీరో..హీరోయిన్స్. తెలుగు టెంపర్ చిత్రానికి ఈ మూవీ రీమేక్. ప్రస్తుతం రణ్వీర్, రోహిత్, సారా టీం షూటింగ్లో భాగంగా స్విట్జర్లాండ్‌లో చక్కర్లు కొడుతోంది. స్విస్‌లోని అందమైన లొకేషన్లలో షూట్ నడుస్తోంది. చిత్రయూనిట్ లొకేషన్లో దిగిన ఫొటోలు, స్విస్ పర్వతాల మధ్య సారా చేసిన పారా గ్లైడింగ్ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.