ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్‌బాబు మేనల్లుడి సినిమా ప్రారంభం

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 10:00 AM



సూపర్ స్టార్ మహేష్‌బాబు మేనల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తోన్న ‘అదేనువ్వు అదేనేను’ చిత్రం ద్వారా ఆయన సినీ రంగంలోకి అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా శశి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ భామ నభా నతేష్ ఈ చిత్రంలో అశోక్ సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. పూజాకార్యక్రమాలు నిర్వహించి తొలి షాట్‌ను చిత్రీకరించారు.


ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి తొలి షాట్‌కు క్లాప్‌నిచ్చారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్ తల్లిదండ్రులు గల్లా రామచంద్రనాయుడు, గల్లా అరుణ కుమారి.. జయదేవ్ భార్య గల్లా పద్మావతితో పాటు ఘట్టమనేని మంజుల, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com