జ‌బ‌ర్ద‌స్త్ యాంకర్ రష్మీకి అరుదైన వ్యాధి

  Written by : Suryaa Desk Updated: Fri, Oct 19, 2018, 11:19 AM

జ‌బ‌ర్ద‌స్త్ అనే కార్య‌క్ర‌మంతో బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌కి వినోదాన్ని పంచుతున్న అందాల భామ ర‌ష్మీ గౌత‌మ్‌. వెండితెర‌పై కూడా ప‌లు సినిమాల‌తో అల‌రించిన ర‌ష్మీ ఇటీవ‌ల త‌న‌కున్న అరుదైన వ్యాధి గురించి చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఇది విన్న అభిమానులు ఆమెకి త‌గు సూచ‌న‌లు ఇచ్చారు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మీని ఓ అభిమాని ఈ మ‌ధ్య మీరు చాలా లావుగా క‌నిపిస్తున్నారు. శ‌రీరాకృతి విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుపోతే కెరీర్ ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంది. మీ కెరీర్ త్వ‌ర‌గా ముగిస్తే మేం భ‌రించ‌లేము అని ట్వీట్ చేశారు. దీనికి ర‌ష్మీ లావుగా కనిపించ‌డానికి గ‌ల కార‌ణాలు వివ‌రించింది. 


12 ఏళ్ళ వ‌య‌స్సు నుండి తాను రుమాటిజం అనే వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టు ర‌ష్మీ తెలిపింది. ఎప్ప‌టి నుండో ఆహార‌పు అల‌వాట్ల‌లో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న నాకు లావు విష‌యంలో కొన్ని హెచ్చు త‌గ్గులు వ‌స్తుంటాయి. ఇలాంటి విష‌యాలు ఒత్తిడి పెంచి , డిప్రెష‌న్‌కి గురి చేస్తాయి. ఈ వ్యాధి నుండి బ‌య‌ట‌ప‌డ‌టానికి చాలా మంది తీసుకున్న నిర్ణ‌యాలు వారికి దుష్ప‌రిణామాలు క‌లిగేలా చేశాయి. నాకు అలాంటి పరిస్థ‌తి వ‌స్తే గౌరవంగా త‌ప్పుకుంటాను అని ర‌ష్మీ ట్విట్ట‌ర్ వేదిక‌గా క్లారిటీ ఇచ్చింది. మ‌న‌సులో ఇంత బాధ పెట్టుకొని స్క్రీన్‌పై ఎప్పుడు న‌వ్వుకుంటూ ఉండే మిమ్మ‌ల్ని చూస్తుంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది అంటూ ప‌లువురు ట్వీట్స్ పెడుతున్నారు. 
Recent Post