ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లా మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ , యూట్యూబ్ లో అదరగొడుతున్న ట్రైలర్, మ్యూజిక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 14, 2018, 01:33 PM



విలక్షణ క్యారెక్టర్ నటుడు కమల్ కామరాజ్ హీరోగా , మౌర్యాని హీరోయిన్ గా మున్నా రమేష్ బాబు నిర్మాతగా ,గగన్ గోపాల్ దర్శకత్వం లో శ్రీ విగ్నేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై లవ్ అండ్ వార్ మూవీ ఫస్ట్ లుక్ ఫంక్షన్ విజయవాడ లో ఘనం గా జరిగింది . ఈ చిత్రం మధురామ్ అపార్ట్మెంట్లో సంతోషంగా జీవిస్తున్న జంట, రాధా (మౌర్యనీ) మరియు విక్రమ్ (కమల్ కామరాజ్) కథను వివరిస్తుంది.అకస్మాత్తుగా ఏర్పడిన ఒక సంఘటనను వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు , ఆ అపార్ట్మెంట్ లో మిస్టరీ ఏంటి అనే ఆసక్తికర కధాంశం తో అందర్నీ ఆకట్టుకునే విధంగా తీర్చి దిద్దారని యూనిట్ సభ్యులు తెలిపారు. దర్శకులు గగన్ గోపాల్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ కి నిర్మాతలు కొత్త అయినా కథ చెప్పగానే వెంటనే షూటింగ్ మొదలు పెట్టి ఎటువంటి సహాయం కావాలన్నా సినిమా నిర్మాణం లో అన్ని రకాలుగా తోడ్పాటు అందించిన మున్నా రమేష్ బాబు గార్కి ధన్యవాదాలు తెలిపారు . యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసిన మ్యూజిక్ jukebox  అందర్నీ అలరిస్తున్నందుకు వీక్షకులకు ధన్యవాదాలు తెలిపారు .







 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com