ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫహద్‌ ఫాజిల్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 15, 2018, 12:12 PM



దక్షిణాదిలో ప్రతిభావంతమైన నటిగా పేరు తెచ్చుకుంది నిత్యా మీనన్‌. బాలనటిగా తెరకు పరిచయమైన నిత్యా…ఆ అనుభవమంతా నాయికగా మారిన తర్వాత చూపిస్తోంది. చిన్న పాత్ర చేసినా…అందులో ప్రభావం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటుంది. త్వరలో ఈ భామ మలయాళంలో ఓ ప్రేమ కథలో నటించబోతోంది. ఈ చిత్రం గురించి నిత్యా మీనన్‌ మాట్లాడుతూ….నేనో మలయాళ చిత్రంలో నటించబోతున్నాను. ఇదొక ప్రేమ కథ. బెంగళూర్‌ డేస్‌ చిత్రంలో నాతో కలిసి నటించిన ఫహద్‌ ఫాజిల్‌తో ఈ చిత్రంలో నీటిస్తున్నాను. అరుదైన ప్రేమ కథ ఇది. వచ్చే ఫిబ్రవరి లేదా మార్చిలో చిత్రీకరణ మొదలు పెడతాం. అన్నారు.


ఇక తను నటిస్తున్న ప్రస్తుత సినిమా ప్రాణ గురించి మాట్లాడుతూ…ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లో చేస్తున్నాం. చిత్రీకరణ పూర్తి అయ్యింది. డిసెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు నాకు నిమిషం తీరిక లేదు. నేను నా పాత్రలో ఆలస్యం లేకుండా నటించినా…నాలుగు భాషల్లో మళ్లి మళ్లి చిత్రీకరణ చేయడం వల్ల సినిమా ఎక్కువ సమయం తీసుకుంది. చిత్ర బృందంలో నాలుగు భాషలు నాకే తెలుసు కాబట్టి కథా చర్చల్లో కూడా పాల్గొన్నాను. అని చెప్పింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com