ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న నాగ చైతన్య చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 15, 2018, 04:47 PM



వివాహం కాకముందు ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాలలో స‌మంత‌, నాగ చైత‌న్యలు కలసి నటించారు.. ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్క‌టైన త‌ర్వాత తొలిసారిగా న‌టిస్తున్న మూవీ మ‌జిలీ..నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్న‌ది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నేటి నుంచి మ‌లి షెడ్యూల్ విశాఖ‌ప‌ట్నంలో ప్రారంభ‌మైంది..19 వ‌ర‌కు ఈ షూటింగ్ అక్క‌డ కొనసాగ‌నుంది.. .హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ ,రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపి సుంద‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com