అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన "పుష్ప : ది రైస్" మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీ సీక్వెల్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకాభిమానులు.
మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం, దసరా పండగ తదుపరి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాలి. ఐతే, ఎక్కడ అన్నది మాత్రం సస్పెన్స్. లేటెస్ట్ గా ఆ సస్పెన్స్ రివీల్ అయిపొయింది. హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో నిర్మించబడిన అల్లు స్టూడియోస్ వచ్చే నెల ఒకటవ తేదీన ఘనంగా ఆరంభం కాబోతుంది. దీంతో ఆ స్టూడియోస్ లోనే పుష్ప 2 షూటింగ్ సుకుమార్ ఏర్పాటు చేసారని వినికిడి.
పోతే, సీక్వెల్ లో కూడా రష్మిక మండన్నానే హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ లు కూడా తమ పాత్రల్లో కంటిన్యూ అవ్వనున్నారు. మరి, ఇంకే కొత్త నటీనటులు ఈ సినిమాలో భాగమవుతారో చూడాలి.