మాస్ రాజా రవితేజ "ధమాకా" ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం ప్రమోషన్స్ ను జరుపుకుంటుంది. ముందుగా రొమాంటిక్ గ్లిమ్స్ తో మొదలైన ప్రమోషన్స్ ఆపై జింతాక్ మాస్ మసాలా సాంగ్, ఈ రోజు విడుదలవబోయే సెకండ్ లిరికల్ సాంగ్స్ అంటూ... సాగుతున్నాయి.
లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇంటరెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటంటే, అక్టోబర్ 21వ తేదీన ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతుందని మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి, ఈ విషయంపై మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావలసి ఉంది.
ఈ సినిమాకు నక్కిన త్రినాథరావు డైరెక్టర్ కాగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తుండగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.