ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెటిజన్ ట్వీట్ కు... సాయిధరమ్ మెగా స్పందన

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 04:06 PMయాక్సిడెంట్ తదుపరి ఈ మధ్యనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులను ప్రకటించి, వాటి షూటింగులతో బిజీగా ఉన్నారు.
ఆయన హీరోగా నటిస్తున్న ఒక మూవీ షూటింగ్ ఈ మధ్యే హైదరాబాద్ లోని HMT అర్బన్ ఫారెస్ట్రీ లో జరిగింది. షూటింగ్ జరుగుతున్న క్రమంలో చిత్రబృందం అడవిలో చాలా చెత్తను డంప్ చేసింది. ఈ విషయాన్ని ఒక నెటిజన్ సాయిధరమ్ దృష్టికి తీసుకొచ్చారు. అడవిలో ఉండే వివిధ రకాల జంతువులకు ఆ చెత్త హానికరం... దయచేసి ఆ చెత్తను క్లీన్ చేయించండి... అంటూ చిత్రబృందం వేసిన చెత్త ఫోటోలను సాయిధరమ్ కు ఒక నెటిజన్ పంపించాడు.
నెటిజన్ ట్వీట్ కు మెగా మేనల్లుడు వెంటనే స్పందించి, ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కడి చెత్తను తక్షణమే క్లీన్ చేయిస్తానని మాట ఇస్తూ రీ ట్వీట్ చేసారు. చెప్పినట్టే చేసారు కూడా. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com