బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను హిందూ మహా సముద్రంలో ఉన్న రామ వారధి నేపథ్యంలో రూపొందిస్తున్నారు. అక్షయ్ కుమార్ పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.