ప్రముఖ హిందీ నటి నవికా కోటియా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. నావిక గత మూడు రోజులుగా ఆసుపత్రిలో చేసి చికిత్స తీసుకుంటున్నారు. తాను ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నట్లుగా నవికా స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, తనకు వ్యాధి తీవ్రం కావడంతో ఈ మధ్యే ఆస్పత్రిలో చేరినట్లు తెలిపింది. అయితే తనకు వచ్చిన వ్యాధి గురించి మాత్రం తెలియజేయలేదు.