గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయ వివాహం నిమిత్తం ప్రియాంక ఎరుపు రంగు లెహెంగా ధరించింది. దీనిని ప్రముఖ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేశారు. అయితే ఈ లెహెంగా మొత్తాన్ని కుట్టు మెషీన్‌తో కాకుండా చేతితోనే డిజైన్ చేశారట. ఆర్గాంజా పువ్వులు, సిల్క్ ఫ్రెంచ్ నాట్స్, సియామ్ రెడ్ క్రిస్టల్స్‌తో ఈ లెహెంగాను డిజైన్ చేసినట్లు సవ్యసాచి వెల్లడించారు. ఈ లెహెంగాను డిజైన్ చేయడానికి 3,720 గంటలు పట్టిందట. అంతేకాదు కోల్‌కతా నుంచి అనుభవజ్ఞులైన 110 మంది ఎంబ్రాయిడర్లను పిలిపించారు. ఇక ప్రియాంక ధరించిన నగలు మొఘల్ కాలం నాటివి. వాటిలో అన్‌కట్ వజ్రాలు, ఎమిరాల్డ్స్, 22 క్యారెట్ బంగారంలో జపనీస్ ముత్యాలు ఉన్నాయట.