గర్భాన్ని ఎవ్వరూ దాచలేరు : అనుష్క‌

  Written by : Suryaa Desk Updated: Thu, Dec 06, 2018, 08:14 AM

పెళ్లి విషయాన్నైనా దాచగలం కానీ గర్భాన్ని ఎవ్వరూ దాచలేరని తెలిపింది బాలీవుడ్ న‌టి అనుష్క‌శ‌ర్మ‌.  నాకు తెలిసినంత వరకు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతీ హీరోయిన్    ఈ వదంతులను ఎదుర్కొంటూనే ఉంటుంది. ఇలాంటి వదంతులు నటీమణులను పెళ్లి కాకుండానే వివాహితను చేసేస్తాయి, గర్భం దాల్చకుండానే తల్లిని చేసేస్తుంటాయి. ఇలాంటి వాటిని నేను అస్సలు పట్టించుకోను. విని నవ్వుకుని వదిలేస్తాను. ఇప్పుడు నేను 24 గంటలూ నా పనులతోనే బిజీగా ఉన్నాన‌ని తెలిపింది. టెస్ట్‌ సిరీస్‌ నిమిత్తం అనుష్క భర్త, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియాలో ఉన్నారు. త్వరలో అనుష్క కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఈ నెల  11న తమ తొలి పెళ్లిరోజు వేడుకను అక్కడే సెలబ్రేట్‌ చేసుకోనున్నారట.


 
Recent Post