సూట్ కానీ హీరోయిన్ల తో సందీప్ కిషన్

  Written by : Suryaa Desk Updated: Thu, Dec 06, 2018, 10:02 AM

సపోర్టింగ్ రోల్ లో కెరీర్ మొదలుపెట్టి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న సందీప్ కిషన్ ఆ తర్వాత హిట్ కొడితే ఒట్టు అన్నట్టుగా మారిపోయాడు. దర్శకుడు ఎవరైనా ఇంకో హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నా ఫలితం మాత్రం మారడం లేదు. పై పెచ్చు తన తో చేసిన వాళ్ళు త్వరగా ఫేడ్ అవుట్ అయిపోవడం ఇంకా బాధించే విషయం. నక్షత్రం డిజాస్టర్ తర్వాత పెద్దగా కనిపించకుండా పోయిన సందీప్ కిషన్ ఎల్లుండి నెక్స్ట్ ఏంటి తో వస్తున్నాడు. తన పేరు మీద కాకుండా తమన్నా బ్రాండ్ మీద ఈ సినిమా కొద్దోగొప్పో ఆసక్తి రేగడానికి కారణం కావడం అసలు ట్విస్ట్. 


నిజానికి సందీప్ కన్నా తమన్నా చాలా సీనియర్. ఒకప్పుడంటే ఏమో కానీ ఇప్పుడు సీనియర్ హీరోలతో కూడా ఒప్పుకుంటోంది. ఎఫ్2 లో వెంకటేష్ సరసన ఆడిపాడిన మిల్కీ బ్యూటీ త్వరలో చిరంజీవి కోసం సైరా సెట్స్ లో అడుగు పెట్టనుంది. ఈ ఇద్దరూ అర సెంచరీ వయసు దాటిన హీరోలే. సో సందీప్ సరసన చేయడంలో ఎలాంటి విశేషం లేదు. ఇక సందీప్ కిషన్ మరో కొత్త సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెనాలిరామకృష్ణ బిఏ బిఎల్ పేరుతో రూపొందనున్న ఈ మూవీలో హన్సిక హీరోయిన్. 


ఒకప్పుడంటే యాపిల్ బ్యూటీగా రవితేజ లాంటి స్టార్లతో చేసింది కానీ ఇటీవలి కాలంలో మంచు హీరోలతో తప్పిస్తే ఇంకెవరు ఛాన్స్ ఇవ్వడం లేదు. సో హన్సిక జోడిగా ఉండటం వల్ల పెద్దగా ప్లస్ అయ్యేది ఏమి లేదు. పైగా మార్కెట్ ఇలా పడిపోయిన దిశలో సందీప్ కిషన్ తనకు సూట్ కానీ మాజీ బ్యూటీలను తీసుకోవడం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. అసలే హిట్స్ లేని కరువులో ఇలా తనకు సూట్ కానీ హీరోయిన్ల తో సందీప్ కిషన్ సక్సెస్ అందుకుంటాడో లేదో మొదటి టెస్ట్ ఎల్లుండి నెక్స్ట్ ఏంటి రూపంలో ఎదురవుతుంది. లెట్ వెయిట్ అండ్ సి
Recent Post