500 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్

  Written by : Suryaa Desk Updated: Thu, Dec 06, 2018, 12:45 PM

నవంబర్ 29 న రిలీజైన 2పాయింట్ 0 కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నది.  వీకెండ్ వరకు రూ. 400 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది.  తెలుగు, హిందీ భాషల్లో కలెక్షన్ల పరంపర కొనసాగుతూనే ఉన్నది.  వీక్ డేస్ లో కలెక్షన్లు తగ్గుతాయని అనుకున్నారు.  కానీ, అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. హిందీలో ఈ సినిమా నిన్న ఒక్కరోజే రూ.10 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.  అటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాం లో ఈ సినిమా రూ.16 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.  డబ్బింగ్ సినిమాల్లో ఇదే టాప్ షేర్. 


 


 
Recent Post