ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఓకే ఒక జీవితం' డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన సోనీ Liv

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 07:38 PM



శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ నటించిన 'ఓకే ఒక జీవితం' సినిమా సెప్టెంబర్ 9, 2022న తెలుగు మరియు తమిళంలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా డల్ గా ప్రారంభమైనప్పటి పాజిటివ్ టాక్ కారణంగా ఫుల్ ఆక్యుపెన్సీలతో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ సోనీ Liv భారీ మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఈ నెల 10వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని సమాచారం.


ఫామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన గ్లామర్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తుంది. ఈ చిత్రంలో అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com