ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ‌రుణ్ తేజ్ ‘అంత‌రిక్షం’ మూవీ ట్రైల‌ర్

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 09, 2018, 12:23 PM



మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌, బాలీవుడ్ న‌టి అదితీరావ్‌ హైదరీ, లావ‌ణ్యా త్రిపాఠి కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘అంతరిక్షం: 9000 kmph’. ఘాజీ ఫేమ్ సంకల్ప్‌రెడ్డి ఈ మూవీకి దర్శకుడు. ఈ నెల 21వ తేదిన ఈ మూవీ రిలీజ్ కానుంది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. ఇందులో వరుణ్‌తేజ్‌ వ్యోమగామిగా కనిపించాడు.. అంత‌రిక్షంలోని ఒక శాటిలైట్ అదుపు త‌ప్ప‌డంతో ప్ర‌పంచ క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ అంతా ఆగిపోయే ప‌రిస్థితుల్లో వ‌రుణ్ ఆ శాటిలైట్ ను తిరిగి య‌ధాస్థానంలో ఉంచేందుకు అంత‌రిక్షంలోకి వెళ్లిన‌ట్లు ఈ ట్రైల‌ర్ లో చూపారు..ఈ ట్రైల‌ర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హాలీవుడ్ స్థాయిలో ఉంటే, ఇక ట్రైల‌ర్ ను సైతం హాలీవుడ్ మూవీలా క‌ట్ చేశారు..ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వై.రాజివ్‌రెడ్డి, కె.సాయిబాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ద‌ర్శ‌కుడు క్రిష్‌ జాగర్లమూడి సమర్పిస్తున్నారు. తాజాగా విడుద‌లైన ఈ ట్రైల‌ర్ ను మీరూ చూడండి..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com