ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్టా మూవీ నుంచి కొత్త పోస్టర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 10, 2018, 11:25 AM



సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పెట్టా' అనే సినిమాలో నటిస్తున్న విషయ తెలిసిందే. ఈ సినిమా తమిళనాట పొంగల్ కు రిలీజ్ కానుంది. దీంతో 'పెట్టా' టీమ్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.  ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు లిరికల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అనిరుధ్ మ్యూజిక్ మాసును ఊపేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా పెట్టా టీమ్ ఈ సినిమానుండి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.


ఈ పోస్టర్లో రజనీ ట్రెడిషనల్ గెటప్ లో.. వైట్ షర్ట్ లో తమిళ స్టైల్లో మీసాలు మెలిదిప్పాడు. వాటికి తోడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చెన్నై బ్యూటీ త్రిషతో సరసాలడుతున్నాడు.   తలలో ఓ ఐదారు మూరల మల్లెపూలను.. చేతుల నిండా గాజులను పెట్టుకున్న త్రిష చీరకట్టులో ఊయలపై ఊర్చుంటే సూపర్ స్టార్ ఆ ఊయలను ఊపుతున్నాడు. ఈ పోస్టర్ చూసి రజనీ వయసు అరవై పైనే అంటే ఎవ్వరూ కూడా నమ్మలేరు. అంత యంగ్ గా ఉన్నాడు. ఈ సినిమాలో త్రిష 'సరో' అనే పాత్ర పోషిస్తోంది.


ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్ధిన్ సిద్దిఖి.. విజయ్ సేతుపతి.. బాబీ సింహా.. సిమ్రాన్ లు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.  దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఇప్పటివరకూ చేసిన సినిమాలనీ డిఫరెంట్ కావడంతో ఈ సినిమాతో సూపర్ స్టార్ ను కొత్తగా ప్రెజెంట్ చేస్తాడనే అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com